Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● కొండ్రపల్లి శ్రీనుకు ఘన సన్మానం… ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం● రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ● గోవాలోని వాస్కో మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల అదుపునకు భారత నౌకాదళం సహాయం● ఇటలీ పర్యటన ముగించుకున్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్● సహకార రంగ అభివృద్ధికి 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి: అమిత్ షా● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● కొండ్రపల్లి శ్రీనుకు ఘన సన్మానం… ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం● రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ● గోవాలోని వాస్కో మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల అదుపునకు భారత నౌకాదళం సహాయం● ఇటలీ పర్యటన ముగించుకున్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్● సహకార రంగ అభివృద్ధికి 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి: అమిత్ షా
Home › బ్రేకింగ్ న్యూస్ › చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం
బ్రేకింగ్ న్యూస్

చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం

చందంపేట, అక్టోబర్ 30 (Ayush 24 News): దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు.

11:55 ఉదయం AM

చందంపేట, అక్టోబర్ 30 (Ayush 24 News):
దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మాజీ సర్పంచ్ సోమణి నాయక్‌కు పరామర్శ
రేకులగడ్డ మాజీ సర్పంచ్ కేతావత్ సోమణి నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ తెల్దేవరపల్లిలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
బొడ్డుపల్లి లక్ష్మమ్మ మృతికి నివాళులు
తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లి అనిల్, సతీష్‌ల తల్లి బొడ్డుపల్లి లక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ సర్పంచ్ రామావత్ గోప్య నాయక్ కుటుంబానికి పరామర్శ
చందంపేట మండలం ఉమ్మడి పోలేపల్లి (బిల్డింగ్ తండా) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రామావత్ గోప్య నాయక్ మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సబావత్ భాష కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
బండమీది తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు సబావత్ భాష ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, చందంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మూఢవత్ శంకర్ కుటుంబానికి ఆర్థిక భరోసా
బండమీది తండాకు చెందిన మూఢవత్ శంకర్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే బాలు నాయక్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో దొండేటి మల్లారెడ్డి, ఏడుపుల గోవింద్ యాదవ్, జర్పుల బధ్యా నాయక్, కిన్నెర హరికృష్ణ, వాంకునావత్ పాపా నాయక్, కేతావత్ మకట్ లాల్, నేనావత్ భరత్, బొద్దికూర మహాలక్ష్మయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 1🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
272 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App