గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్లు అందుకున్న కరాటే బుడోకాన్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ విద్యార్థులు

ఏప్రిల్ 26న సాధించిన గిన్నిస్ రికార్డుకు నేడు అధికారిక సర్టిఫికెట్లు అందజేత
హైదరాబాద్, జూలై 19 (ఆయుష్ 24 న్యూస్):
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 2026 ఏప్రిల్ 26న నిర్వహించిన “ది లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే” కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కరాటే బుడోకాన్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (KBFI) విద్యార్థులకు నేడు అధికారిక Guinness World Records Certificates అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా కరాటే బుడోకాన్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (KBFI) వ్యవస్థాపకులు, గ్రాండ్ మాస్టర్ బి. పరమేష్ మాస్టర్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో భారత కరాటే ప్రతిభను చాటిచెప్పిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ అరుదైన ఘనత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ పండు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లను అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘనతతో విద్యార్థులు తమ కుటుంబాలకు, గురువులకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని నిర్వాహకులు తెలిపారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థులను గ్రాండ్ మాస్టర్ బి. పరమేష్ మాస్టర్, మాస్టర్ పండు, పలువురు కరాటే మాస్టర్లు, తల్లిదండ్రులు, క్రీడా ప్రముఖులు అభినందించి వారి భవిష్యత్తు మరిన్ని విజయాలతో నిండాలని ఆకాంక్షించారు.
ఈ విజయంతో కరాటే బుడోకాన్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దేశవ్యాప్తంగా కరాటే అభివృద్ధికి మరింత కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
– అయుష్ 24 న్యూస్

