Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › కొండ భీమనపల్లిలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు
బ్రేకింగ్ న్యూస్

కొండ భీమనపల్లిలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాండన్ ధర్మేందర్ సింగ్ కొండ భీమనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాండన్ ధర్మేందర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ

12:52 మధ్యాహ్నం PM

మాండన్ ధర్మేందర్ సింగ్‌కు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం

కొండ భీమనపల్లి | ఆగస్టు 28 | అయుష్ 24 న్యూస్

కొండ భీమనపల్లి గ్రామంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాండన్ ధర్మేందర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాండన్ ధర్మేందర్ సింగ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా టోంగర్ ప్రతాప్

ఈ కార్యక్రమంలో కొండ భీమనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టోంగర్ ప్రతాప్ పేరును బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లోకి వెళ్లాలి: రమావత్ రవీంద్ర కుమార్

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించడంతో పాటు, బీఆర్ఎస్ పార్టీ విధానాలు, గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామస్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలుసుకుని పార్టీ కార్యక్రమాలను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడారి సైదులు యాదవ్, ఇట్టికాల రాజు, అప్పనాల తిరుమల్, బొడ్డుపల్లి ఏడుకొండలు, గుండాల వెంకట్ యాదవ్, ఎర్ర విజయ్, కడారి శ్రీను యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, కడారి యాదయ్య యాదవ్, గుంటోజు రాజు, పగిళ్ల శ్రీను, మెండే రాజు యాదవ్, భీనమోని శివ యాదవ్, జక్కుల లింగం యాదవ్, కడారి శేఖర్ యాదవ్, ఎర్ర అశోక్, గొట్టుముక్కుల శివ, ఎర్ర వెంకటేష్, కడారి హరీష్ యాదవ్, కడారి చిన్న మల్లేష్ యాదవ్, టోంగర్ సర్దార్ సింగ్, జబ్బు బాలయ్య యాదవ్, కొప్పుల శివ గౌడ్, ఏడుపుల ఆంజనేయులు యాదవ్, చంద్రయ్య, ఎర్ర వెంకటయ్య, రాజు, మాండన్ కిషన్, ఎర్ర వలిం తదితరులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — ప్రజలకు వాస్తవ సమాచారాన్ని బాధ్యతాయుతంగా అందించడమే మా లక్ష్యం.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 19🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *