పోలీసు అధికారులను సన్మానించిన గణేష్ మండప నిర్వాహకులు
హాలియా, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
హాలియా పట్టణంలోని సాయి ప్రతాప్ నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మిర్యాలగూడ డీఎస్పీ రవి, సీఐ ఎస్. రాఘవరావు, ఎస్ఐ బండి సాయి ప్రశాంత్ మంగళవారం మండప నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవి మాట్లాడుతూ.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జన వేడుకలను కూడా శాంతియుతంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు.
నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలకు దూరంగా ఉండి, భారతీయ హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా భజనలు, కీర్తనలతో మహిళా భక్తులు, భక్తుల భాగస్వామ్యంతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.
అనంతరం మండప నిర్వాహకుడు పుచ్చకాయల రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఎస్పీ రవి, సీఐ రాఘవరావు, ఎస్ఐ బండి సాయి ప్రశాంత్లను శాలువాలతో ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి కాలనీ భక్తులు, గణేష్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH










Leave a Reply