కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
దేవరకొండ పట్టణానికి చెందిన గాజుల రాజేష్ కుమారుడు గాజుల అభినయ్ రాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ మంగళవారం గాజుల రాజేష్, గాజుల ఆంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా అభినయ్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కన్న కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని అన్నారు. అభినయ్ రాజు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

జగదీశ్ రెడ్డిని చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి, రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. అభినయ్ రాజు జ్ఞాపకాలను స్మరించుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గాజుల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రామచంద్ర నాయక్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, బిల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply