మృతుడి వివరాలపై పోలీసుల ఆరా.. కారణాలపై దర్యాప్తు
హనుమకొండ, సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి:
హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాయుడు కుండా బిర్యానీ హోటల్ ఎదురుగా ఉన్న రహదారిపై డివైడర్ మధ్యలోని చెట్టుకు ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
మృతుడి వద్ద లభించిన బస్ టికెట్, సెల్ఫోన్ ఆధారంగా అతడి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు హనుమకొండకు ఎప్పుడు, ఎందుకు వచ్చాడనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
AYUSH24 NEWS
The Voice of Truth
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు









Leave a Reply