జాతీయ చైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న ధనంజయ్య
నల్లగొండ | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
భారత జాతీయ కళా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ (INTACH) నల్లగొండ చాప్టర్ నూతన కన్వీనర్‌గా దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ సముద్రాల ధనంజయ్య నియమితులయ్యారు.
న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ఉన్న INTACH ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సంస్థ జాతీయ చైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్.. సముద్రాల ధనంజయ్యకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో INTACH మెంబర్ సెక్రటరీ రవీంద్ర సింగ్ (ఐఏఎస్ రిటైర్డ్), నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఇంజనీర్ వేదకుమార్ మణికొండ, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు నీల్ కమల్ మహేశ్వరి, చాప్టర్స్ డివిజన్ డైరెక్టర్ కెప్టెన్ శుక్లా, సంస్థ సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా నియమితులైన సముద్రాల ధనంజయ్య మాట్లాడుతూ.. నల్లగొండ ప్రాంతంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదకు మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.
జిల్లాలోని వారసత్వ సంపదను పరిరక్షించి, భవిష్యత్ తరాలకు అందించేలా ప్రజల సహకారంతో కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన INTACH సంస్థ నాయకత్వానికి, తెలంగాణ స్టేట్ చాప్టర్ కన్వీనర్‌కు ధనంజయ్య కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని ప్రాచీన దేవాలయాలు, కోటలు, బౌద్ధ అవశేషాలు, జానపద కళలు, హస్తకళలను గుర్తించి వాటి డాక్యుమెంటేషన్, పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని ఈ సందర్భంగా ధనంజయ్య తెలిపారు.










Leave a Reply