మంథని: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా పదవి పొందిన సందర్భంగా ఆరెల్లి కిరణ్ గౌడ్‌ను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెడ్డి సంఘం ప్రతినిధులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సయ్యేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కిరణ్ గౌడ్‌ను సన్మానించి అభినందనలు తెలియజేశారు. అలాగే రెడ్డి సంఘం అధ్యక్షులు ముస్కుల సురేంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం నాయకులు సన్మానం చేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
మంథని (ముత్తారం) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఐఎన్టీసీ కార్యదర్శి పెడవేనా లింగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ దోరగొల్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు గుండ రాజు తదితరులు కిరణ్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆరెల్లి కిరణ్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.










Leave a Reply