Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
బ్రేకింగ్ న్యూస్

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

03:57 మధ్యాహ్నం PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.. పలుచోట్ల ఘన స్వాగతం

మంచిర్యాల, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎంపీ పాల్గొన్నారు. ఇందారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా ముందుగా శ్రీరాంపూర్ చౌరస్తాలోని సింగరేణి కార్మికుడి విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీసీసీ కార్నర్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను గజమాలతో సత్కరించారు.

తర్వాత మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన ఎంపీ, రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కేటీఆర్‌పై ఎంపీ వంశీకృష్ణ విమర్శలు

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ కేసీఆర్, కేటీఆర్ రాజకీయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

“ఖబర్దార్ కేటీఆర్.. నీ ఆటలు సాగవు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలను ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు.

గ్లోబరినా సంస్థకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థుల మరణాలకు కేటీఆర్ కారణమయ్యారని ఎంపీ ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు.

పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందించలేదని, మరోవైపు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. యువత, విద్యార్థులపై కేసులు నమోదైతే తప్ప హీరోలు కాలేరన్నట్లుగా కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం

కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎంపీ తెలిపారు. TOMCOM సంస్థ ద్వారా నైపుణ్య ఆధారిత ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఎంపీ విమర్శించారు.

అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు

మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.1.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 30🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
693 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App