ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థన
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): హైదరాబాద్లోని కోఠి సుల్తాన్ బజార్లో కొలువుదీరిన గణనాథుడిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గణనాథుడికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించారు.

అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రిని ఆశీర్వదించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.










Leave a Reply