ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌తో కలిసి షాప్ ప్రారంభం
రామగుండం, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): రామగుండం ఎఫ్‌సీఐ ఎక్స్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కలెక్షన్ మెన్స్ వేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
కమాన్‌పూర్ మండలం కమాన్‌పూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కొండపర్తి వినీత్ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ షాప్‌ను స్థానిక రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌తో కలిసి దుద్దిళ్ల శ్రీను బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకుడు కొండపర్తి వినీత్‌కు వారు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ మంచి పేరు సంపాదించాలని, వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply