వీరనారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్
దేవరకొండ: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply