ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న పార్టీ నాయకులు
మంథని: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ మంథని పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భూమి, భుక్తి, బానిస బతుకుల విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు బూడిద తిరుపతి మాట్లాడుతూ నిజాం పాలన కాలంలో జమీందారులు, దొరల అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ జయంతి వేడుకల్లో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, పట్టణ మాజీ అధ్యక్షుడు చిలువేర సతీష్, సీనియర్ నాయకుడు నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు సామల అశోక్, ఎడ్ల సాగర్, పట్టణ కార్యదర్శులు పార్వతి విష్ణు, మాచిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply