Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › సీసీ నస్పూర్ జాతీయ రహదారి ప్రమాదం బాధాకరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
తెలంగాణ

సీసీ నస్పూర్ జాతీయ రహదారి ప్రమాదం బాధాకరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

10:29 ఉదయం AM

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

మంచిర్యాల: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)

సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులతో మాట్లాడి తెలుసుకున్నట్లు ఎంపీ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై అవసరమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు.

మంచిర్యాల మెడికల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, వారికి అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 16🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App