డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన లారీ — డ్రైవర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
AYUSH24 News ప్రతినిధి
దేవరకొండ: సెప్టెంబర్ 30
పత్తి బేళ్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన ఘటన దేవరకొండ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ భూపోర్ మంజునాథ్ (45), ఆదోని నివాసి గాయపడగా, డ్రైవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
ఆదోని నుంచి పత్తి బేళ్లతో బయలుదేరిన లారీ దేవరకొండ మీదుగా వెళ్తుండగా పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ (మైత్రి) సమీపంలో బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొని కుడివైపున బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డ కాలనీవాసులు
తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీపంలోని కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. బయటకు వచ్చి చూడగా రోడ్డుపై లారీ బోల్తా పడి ఉండటాన్ని గుర్తించారు.
ప్రమాదంలో క్లీనర్ భూపోర్ మంజునాథ్‌కు గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో డివైడర్లు, సెంటర్ లైట్లు దెబ్బతిన్నాయి. లారీలోని పత్తి బేళ్లు రోడ్డుపై పడిపోయాయి.
వెంటనే స్పందించిన మూడో వార్డు కౌన్సిలర్

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మూడో వార్డు కౌన్సిలర్ అంకూరి సుమలత రాజేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిన విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు, పత్తి బేళ్లను మున్సిపల్ సిబ్బంది సహాయంతో తొలగించే చర్యలు చేపట్టారు.
పోలీసులు, విద్యుత్ శాఖకు సమాచారం అందించడంతో సంబంధిత సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిన లారీ కారణంగా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టారు.
ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply