పద్మశాలి సంఘం నాయకులతో గంటకు పైగా సుదీర్ఘ చర్చలు
మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో తేనీటి విందులో పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
దేవరకొండ, అక్టోబర్ 1, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గురువారం దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవులుకు మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు స్వాగతం పలికి, పూల మొక్కను అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ హోదాల్లో ఉన్న పద్మశాలి సంఘం నాయకులను చైర్పర్సన్ పున్న వెంకటేశ్వర్లు ఆయనకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా గంటకు పైగా జరిగిన చర్చల్లో పద్మశాలీల జనాభా, ఐక్యత, బలాబలాలు, రాజకీయంగా పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి చిరంజీవులు అడిగి తెలుసుకున్నారు.
దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పున్న శైలజ వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం పద్మశాలి సమాజానికి ఎంతో గర్వకారణమని చిరంజీవులు పేర్కొన్నారు. దేవరకొండ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, తాను నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో అనేక సందర్భాల్లో దేవరకొండను సందర్శించినట్లు తెలిపారు.
భవిష్యత్తులో పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా స్థిరపడినప్పుడే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు గుర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘం, చేనేత సహకార సంఘం, పద్మశాలి సంఘం నాయకులు, కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్న పద్మశాలి నాయకులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply