సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మహాత్మా గాంధీ జయంతిని మతసామరస్య దినోత్సవంగా జరుపుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా దేవరకొండలోని పల్లా పర్వత్ రెడ్డి భవన్లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీని స్మరించుకుంటూ మతసామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తుం బుచ్చిరెడ్డి, మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు, మండల కార్యవర్గ సభ్యులు పల్లా రంగారెడ్డి, జూలూరి వెంకట్రాములు, ఎండి మైనొద్దీన్, కిన్నెర యాదయ్య, మహిళా సమాఖ్య డివిజన్ కార్యదర్శి లింగంపల్లి అనిత, పట్టణ సహాయ కార్యదర్శులు తోటపల్లి నాగేష్, జూలూరి జ్యోతిబస్, శాఖ కార్యదర్శులు అలామోని మల్లయ్య, లింగంపల్లి వెంకటయ్య, ఏషామోని మల్లేష్, నాయకులు నాంపల్లి రాజమల్లయ్య, కొండోజు ఆనందచారీ, బొడ్డుపల్లి గెల్వయ్య, జక్క కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, కాటం వెంకటయ్య, బక్కయ్య, రాజు, వెంకట్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply