గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్
మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గాంధీ జయంతి సందర్భంగా మంథని మున్సిపల్ పరిధిలోని గాంధీచౌక్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ పాలకవర్గ సభ్యులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. అహింస, సత్యాగ్రహ మార్గాల్లో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్య సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచిడి రాజు గౌడ్, పోతరబోయిన శ్రీలత, ఎల్లంకి వంశీధర్, నాయకులు వేముల సమ్మయ్య, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply