Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
Home › దేవరకొండ › శాంతిగూడెం సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డికి గ్రామస్తుల ఘన సన్మానం
దేవరకొండ

శాంతిగూడెం సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డికి గ్రామస్తుల ఘన సన్మానం

02:06 మధ్యాహ్నం PM

నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు

శాంతిగూడెం, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శాంతిగూడెం సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డిని సోమవారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సన్మాన సభ నిర్వహించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, నూతన గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా ఇందిరా భాస్కర్ రెడ్డి ఎన్నికై పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. అనంతరం రెండో పర్యాయం సర్పంచ్‌గా చింతలపూడి భాస్కర్ రెడ్డిని గెలిపించుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై స్పందించే స్వభావం, పట్టుదలతో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పాటు నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు కావడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామ సర్పంచ్‌కు జిల్లా స్థాయిలో బాధ్యతలు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు.

చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది శాంతిగూడెం ప్రజలేనని తెలిపారు. రెండు పర్యాయాలు సర్పంచ్‌గా అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, శాంతిగూడెంను ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని భాస్కర్ రెడ్డిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 150🔗 Shares: 5👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App