అర్హులైన ప్రతి కార్మికుడికి ప్రోత్సాహకం చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడి
గతేడాది రూ.1,03,000తో పోలిస్తే ఈసారి బోనస్ పెంపు
హైదరాబాద్, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దసరా, దీపావళి పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకంగా అర్హులైన ప్రతి కార్మికుడికి రూ.1,10,250 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.
దేశానికి వెలుగులు అందించేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని కిషన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణకు కొంగుబంగారమని అభివర్ణించారు.
భూగర్భంలో అహోరాత్రులు శ్రమిస్తూ దేశంతో పాటు తెలంగాణ అభివృద్ధికి సింగరేణి కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
గతేడాది చెల్లించిన రూ.1,03,000తో పోలిస్తే ఈసారి బోనస్ మొత్తాన్ని రూ.1,10,250కు పెంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.60,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.










Leave a Reply