మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
మంథని, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించారు.
మంథని పట్టణంలోని గోదావరి గౌతమేశ్వరి ఆలయం సమీపానికి చెందిన గట్టు సుశీల, పెంజూరు కట్టకు చెందిన మున్ననూరి ఆనంద దేవి, నడివీధిలోని లక్ష్మీనారాయణ ఆలయం సమీపానికి చెందిన చొప్పకట్ల శంకర్ రావు, ఉస్మాన్పురకు చెందిన ఎం.డి వలి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు.
మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడంతో పాటు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply