ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ
బియ్యం, ఉల్లి, వెల్లుల్లి, వంటనూనెల ధరల పెరుగుదలపై ఆందోళన
దేవరకొండ, అక్టోబర్ 08, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గురువారం ఆయన మాట్లాడుతూ, బియ్యం, ఉల్లి, వెల్లుల్లి, వంటనూనెలు, పప్పుధాన్యాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల సన్నబియ్యం కిలో రూ.65 నుంచి రూ.83, ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125 వరకు ధరలు ఉన్నాయని ఆయన తెలిపారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. సామాన్య ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.









Leave a Reply