ప్రజల హక్కుల ఉల్లంఘనపై ప్రతి ఒక్కరూ స్పందించాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్
కొండమల్లేపల్లి, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ప్రజల హక్కుల ఉల్లంఘనపై ప్రతి ఒక్కరూ స్పందించవచ్చని ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లిలోని ఎన్హెచ్ఆర్సీ కార్యాలయంలో నూతన సభ్యులకు ఐడీ కార్డులు, నియామక పత్రాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడితో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండమల్లేపల్లి, దేవరకొండ, పీఏ పల్లి, గుర్రంపోడు, మర్రిగూడ మండలాల నుంచి నూతనంగా ఎనిమిది మంది సభ్యులు చేరినట్లు తెలిపారు. వారికి నియామక పత్రాలు, ఐడీ కార్డులు అందించినట్లు పేర్కొన్నారు.
నూతన సభ్యులు ప్రజల హక్కులకు సంబంధించిన సమస్యలపై వారి పక్షాన నిలబడాలని సూచించారు. వివిధ మండలాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించే దరఖాస్తులను స్వీకరించి తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

తెల్ల కాగితంపై ఫిర్యాదు అందించినా పరిష్కారం కోసం తమ సంస్థ తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 100లోపు సభ్యులు చేరారని, మహిళలు సైతం సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. మరింత మందికి సభ్యత్వం అందించేందుకు కొండమల్లేపల్లిలో కార్యాలయం ఏర్పాటు చేసి సభ్యులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండి నరేష్, రాష్ట్ర కార్యదర్శి తడకమళ్ళ బిక్షమయ్య, నియోజకవర్గ మహిళా సంఘం అధ్యక్షురాలు గంజి యాదమ్మ, డివిజన్ అధ్యక్షురాలు తడకమళ్ళ లక్ష్మి, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నూతన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply