చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్
విలోచవరం, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
విలోచవరం గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాగం శ్రీను తండ్రి కీ.శే. రాగం రాజయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ పాల్గొని రాగం రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడుదుల వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అరెల్లి కిరణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎరుకల ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు దాది క్రాంతి కుమార్, బూడిద రమేష్, అర్థం రాజు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply