మంథనిలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు
మంథని: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా మంథనిలోని క్యాంపు కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వోడ్నల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశం కోసం పోరాడటంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సామాజిక ఉద్యమకారుడిగా బాపూజీ నిలిచారని తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముందుకు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply