Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం
బ్రేకింగ్ న్యూస్

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం

05:57 తెల్లవారుజాము AM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి, బీపీ, షుగర్ వైద్య శిబిరం

దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య అన్నారు.

బుధవారం దేవరకొండ మండలంలోని కర్నాటిపల్లి గ్రామంలో కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి జ్ఞాపకార్థం, కాశిరెడ్డి నరేందర్ రెడ్డి కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఉచిత కంటి, బీపీ, షుగర్ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరంలో 142 మందికి బీపీ, షుగర్ పరీక్షలు, 176 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల్లో 15 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

లయన్స్ క్లబ్ సెక్రటరీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి కాశిరెడ్డి రఘుమారెడ్డి ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేస్తూ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన జ్ఞాపకార్థం కర్నాటిపల్లి గ్రామంతో పాటు మరో 9 గ్రామపంచాయతీల్లో ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిలుకూరి కాశీనాథ్, సీనియర్ లయన్స్ గాజుల రాజేష్, నల్లమాద నారాయణరెడ్డి, లకుమారపు మల్లయ్య, వనం శ్రీనివాసులు, సముద్రాల ప్రభాకర్, ఆప్టోమెట్రిస్ట్ హరి తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 38🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *