ఆసియా గేమ్స్ ప్రారంభ వేడుకల్లో మను భాకర్, పవన్ షెరావత్ ఫ్లాగ్ బేరర్లు
503 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత్
నాగోయా, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు–2026 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాగోయాలోని పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకంతో ఉత్సాహంగా కవాతు చేశారు.
భారత బృందానికి రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, స్టార్ కబడ్డీ క్రీడాకారుడు పవన్ షెరావత్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. చేతిలో త్రివర్ణ పతకాన్ని పట్టుకుని భారత బృందానికి ముందుండి నడిచిన ఈ ఇద్దరి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
🇮🇳 చివరి నిమిషంలో ఫ్లాగ్ బేరర్ మార్పు
తొలుత మను భాకర్‌తో పాటు షాట్‌పుట్ స్టార్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపికయ్యారు. అయితే అధికారిక వేడుకల కిట్‌కు సంబంధించిన లాజిస్టిక్స్ సమస్య కారణంగా తూర్ ప్రారంభ వేడుకలకు హాజరు కాలేకపోవడంతో, చివరి నిమిషంలో ఆయన స్థానంలో పవన్ షెరావత్‌ను ఎంపిక చేశారు.
👗 సంప్రదాయం–ఆధునికత కలయికగా భారత బృందం
ప్రారంభ వేడుకల్లో భారత మహిళా అథ్లెట్లు సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో, పురుష అథ్లెట్లు నేవీ-బ్లూ బంధ్‌గలా దుస్తుల్లో కనిపించారు. భారతీయ సంస్కృతి, క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
🏅 503 మంది అథ్లెట్లతో భారత్
ఈ ఆసియా క్రీడల్లో భారత్ 503 మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది. వీరిలో 269 మంది పురుషులు, 234 మంది మహిళలు ఉన్నారు. భారత క్రీడాకారులు 36 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు.
2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. మొత్తం 45 దేశాలు, ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు.
త్రివర్ణ పతాకం చేతిలో.. దేశం గుండెల్లో..
విజయమే లక్ష్యంగా భారత క్రీడాకారుల పయనం ప్రారంభమైంది. 🇮🇳🏆
AYUSH 24 NEWS
The Voice of Truth










Leave a Reply