తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చిన్నారికి ఘనంగా అన్నప్రాశన వేడుక
అంగన్‌వాడీ ఆధ్వర్యంలో సహాన్స్ నాయక్‌కు అన్నప్రాశన – తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన
AYUSH24 NEWS | టేకులపల్లి
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెగళ్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పుగూడెం తండాలో అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారి జాటోత్ సహాన్స్ నాయక్కు సంప్రదాయబద్ధంగా అన్నప్రాశన వేడుక నిర్వహించారు.

జాటోత్ నరేష్ నాయక్ – సింధూర దంపతుల కుమారుడు సహాన్స్ నాయక్‌కు కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నప్రాశన నిర్వహించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది తల్లిపాల ప్రాధాన్యత, శిశు పోషణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై తల్లులకు అవగాహన కల్పించారు. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు, అనంతరం పౌష్టికాహారం ఎంతో అవసరమని వివరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు అనసూర్య, వెంకటరమణ, చిన్నారులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS | The Voice of Truth

