Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా కొర్ర రాంసింగ్ నాయక్
బ్రేకింగ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా కొర్ర రాంసింగ్ నాయక్

12:52 మధ్యాహ్నం PM

గిరిజన సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

దేవరకొండ, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్

గిరిజన సర్పంచుల సమస్యల పరిష్కారంతో పాటు గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ తెలిపారు.

మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ గిరిజన సర్పంచుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ సదస్సులో దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్‌ను రాష్ట్ర అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కొర్ర రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో వెనుకబడి ఉన్నారని అన్నారు. గిరిజన సర్పంచుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన సీనియర్ శాసనసభ్యుల్లో ఒకరికి క్యాబినెట్ మంత్రి పదవి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కొర్ర రాంసింగ్ నాయక్ తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 1🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *