Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం
బ్రేకింగ్ న్యూస్

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం

11:34 ఉదయం AM

ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా చెల్లింపులు జరగలేదని ఆరోపణ

తెలంగాణ | అయుష్ 24 న్యూస్

తెలంగాణలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకంపై అనిశ్చితి నెలకొంది. 2026–27 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదని బీఆర్‌ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నట్లు పేర్కొంది.

ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీలోగా సుమారు రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, 2026–27 సంవత్సరానికి ఇప్పటివరకు ప్రీమియం చెల్లింపు జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పథకం ద్వారా సుమారు 42.16 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని పేర్కొంటూ, ప్రీమియం చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతులు, వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

రైతుబీమా పథకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించి రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: పై వార్తలోని ప్రభుత్వంపై ఆరోపణలు, గణాంకాలు అందించిన సమాచారంలోని వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *