ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ గడి ప్రవీణ్ కుమార్ గారు
హైదరాబాద్, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్న TAIKA All India Open Karate Championship 2026కు సంబంధించిన విజేతల మెడల్స్‌ను ముఖ్య అతిథి శ్రీ గడి ప్రవీణ్ కుమార్ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ.. విజేతలకు అందించనున్న మెడల్స్‌ను ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆవిష్కరించడం తమకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు శ్రీ గడి ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
TAIKA Martial Arts Academy ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో వివిధ వయస్సు విభాగాల్లో కుమిటే పోటీలు నిర్వహించనున్నారు.
అదే కార్యక్రమంలో TAIKA Open Challenge Cup కోసం మొత్తం రూ.1,00,000 నగదు బహుమతులు ప్రకటించారు. పురుషులు, మహిళల సీనియర్స్, జూనియర్స్, క్యాడెట్స్, సబ్-జూనియర్స్ విభాగాల్లో విజేతలు, రన్నరప్‌లకు నగదు బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
🏆 పోటీ ప్రత్యేకతలు
📅 తేదీలు: సెప్టెంబర్ 5 & 6, 2026
📍 వేదిక: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్
🥋 విభాగం: కుమిటే
🏆 TAIKA Open Challenge Cup: రూ.1,00,000 నగదు బహుమతులు
💰 ఎంట్రీ ఫీజు: ఒక్కో ఈవెంట్‌కు రూ.2,000
దేశవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలు యువ కరాటే క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలవనున్నాయి.
అయుష్ 24 న్యూస్ 📰🥋










Leave a Reply