ఏడీఈ వస్కుల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం
దేవరకొండ, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఆకలితో ఉన్న వారికి అన్నం అందించి వారి ఆకలి తీర్చాలనే సేవా సంకల్పంతో లయన్స్ క్లబ్‌లు పనిచేస్తున్నాయని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య అన్నారు. ఏడీఈ వస్కుల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, ప్రతి లయన్ సభ్యుడు సేవా దృక్పథంతో సమాజం కోసం ఆర్థిక సహకారం అందించడంతో పాటు తన సమయాన్ని వెచ్చించడం గొప్ప విషయమన్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి భోజనం అందించడం సంతృప్తినిచ్చే సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపడతామని తెలిపారు.
ఏడీఈ వస్కుల సత్యనారాయణ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ వేదిక అనేక మందిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తోందన్నారు. లయన్స్ క్లబ్లో పనిచేయడం ద్వారా మానవతా విలువలు, సామాజిక బాధ్యత, సమాజం పట్ల సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్లో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, వనం శ్రీనివాసులు, తిప్పర్తి రుక్మారెడ్డి, బొడ్డుపల్లి భీష్మాచారి, రాజు, దినేష్‌తో పాటు లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply