Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా నేనావత్ శివ నాయక్
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా నేనావత్ శివ నాయక్

03:29 మధ్యాహ్నం PM

కల్వకుంట్ల కవిత నియామకం.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న శివ నాయక్

దేవరకొండ, సెప్టెంబర్ 15 (అయుష్ 24 న్యూస్):
దేవరకొండ నియోజకవర్గం టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన పార్టీ) ఇన్‌చార్జిగా మండలంలోని కట్ట కొమ్ముతండాకు చెందిన నేనావత్ శివ నాయక్ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి శివ నాయక్ కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా కూడా శివ నాయక్‌ను ప్రకటించినట్లు పేర్కొన్నారు.

🗣️ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: శివ నాయక్

తనకు దేవరకొండ నియోజకవర్గం ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించిన కల్వకుంట్ల కవితకు, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి శివ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ ఆదేశాల మేరకు దేవరకొండ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులను సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని, కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తానని శివ నాయక్ తెలిపారు.

శివ నాయక్ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

– అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 129🔗 Shares: 7👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App