చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి
ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్ష
దేవరకొండ, అక్టోబర్ 20, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ విజయదశమి అని బీఆర్ఎస్ నాయకులు బొడ్డు గోపాల్ గౌడ్ అన్నారు.
విజయదశమి పండుగ సందర్భంగా దేవరకొండ మండల ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ, అధర్మాన్ని అణిచివేసి ధర్మాన్ని నిలబెట్టేందుకు జరిగిన ధర్మయుద్ధం మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో ధర్మం, న్యాయం, సత్యం ఎల్లప్పుడూ విజయం సాధించాలనే గొప్ప సందేశాన్ని విజయదశమి పండుగ అందిస్తుందని తెలిపారు.
విజయదశమి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాలను నింపాలని, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు.
దేవరకొండ మండల ప్రజలందరూ విజయదశమి పండుగను ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బొడ్డు గోపాల్ గౌడ్ కోరారు.









Leave a Reply