Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం

08:31 ఉదయం AM

ఇంటింటికీ మొక్కల పంపిణీ

90 వేల మొక్కలను నాటడమే లక్ష్యం

దేవరకొండ, ఆగస్టు 25, ఆయుష్ 24 న్యూస్:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం దేవరకొండ ఖిల్లాలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 50 మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పున్న శైలజా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 90 వేల మొక్కలను నాటడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొక్కలు నాటాల్సిన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయడంతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికీ ఎలినో ప్రభావం కారణంగా కొంత ఆలస్యమైందని తెలిపారు. నేటి నుంచి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.

నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత మున్సిపాలిటీతో పాటు ఆయా వార్డుల ప్రజలు కూడా తీసుకోవాలని, మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ. సంజీవయ్య, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, పర్యావరణ పరిరక్షణ అధికారి శక్రు నాయక్, ఏఈ రాజు, అర్చన, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్, జగమంతు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 27🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *