Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

02:52 మధ్యాహ్నం PM

దేవరకొండ, ఆగస్టు 19 — అయుష్ 24 న్యూస్:ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ భవనం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కానుగుల ఆంజనేయులు మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఐక్యత, సంక్షేమంతో పాటు సంఘ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైన సంఘ భవనం భవిష్యత్తులో దేవరకొండలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్మాణం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని అందించిన కడారి అంజయ్య యాదవ్ తమపై ఎంతో నమ్మకంతో స్థలం అందించారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించామని, భవిష్యత్తులో కూడా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తామని తెలిపారు.సంఘ అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలని సూచించిన ఆయన, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటూ సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుందని, ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *