రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఆర్ఐ గోపరాజు, అసిస్టెంట్ యాదగిరి పట్టుబడినట్లు సమాచారం
నాంపల్లి: సెప్టెంబర్ 29 (AYUSH24 News ప్రతినిధి)
నల్గొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతుకు సంబంధించిన పౌతి వ్యవహారంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఆర్ఐ గోపరాజు, ఆయన అసిస్టెంట్ యాదగిరి ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు ప్రాథమిక సమాచారం.
మండలానికి చెందిన ఓ రైతు పౌతి కోసం కార్యాలయాన్ని సంప్రదించగా, ఆర్ఐ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అసిస్టెంట్ ద్వారా రూ.15 వేలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది.
ఆర్ఐ గోపరాజు, అసిస్టెంట్ యాదగిరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply