— గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్
మంథని, సెప్టెంబర్ 17: పరిసరాల పరిశుభ్రతపై గ్రామంలోని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ కోరారు.
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య బానేష్ మాట్లాడుతూ.. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్తను వేర్వేరుగా ఎలా నిర్వహించాలో విద్యార్థినీ, విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు కూడా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలక లక్ష్మి, దొడ్డిపట్ల శంకర్, దేవరకొండ పోచం, దేవళ్ళ లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు శివలీల, కార్యదర్శి సతీష్ కుమార్తో పాటు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply