Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో రక్తదాన శిబిరం
బ్రేకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో రక్తదాన శిబిరం

01:27 మధ్యాహ్నం PM

రక్తదానం చేసి సందేశం ఇచ్చిన జనసేన నాయకుడు నల్లగోపుల వెంకట చలపతిరావు

కలిదిండి, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

జనసేన సేవా సైన్యం ఆధ్వర్యంలో, హోప్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర కార్మికుల సంక్షేమ బోర్డు డైరెక్టర్ నల్లగోపుల వెంకట చలపతిరావు సందర్శించారు.

ఈ సందర్భంగా నల్లగోపుల వెంకట చలపతిరావు స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.

పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు మొటేపల్లి హనుమాన్, స్థానిక కూటమి నాయకులు, జనసైనికులు, యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *