Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
బ్రేకింగ్ న్యూస్

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్

12:07 మధ్యాహ్నం PM

ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు

భక్తిశ్రద్ధలతో కొనసాగిన శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి పండుగ

దేవరకొండ, సెప్టెంబర్ 3 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలోని 1వ వార్డు ముత్యాలమ్మ బజార్‌లో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రార్థించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు, జాతరల్లో ప్రజలతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరిపై పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బాలు నాయక్‌కు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శైలజ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ నేతల శ్రీను, యాదవ సంఘం నేతల వెంకటేష్, చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, చందంపేట మాజీ సర్పంచ్ గోసుల అనంతగిరి, వార్డు సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *