Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › డాక్టర్ నేనావత్ రాములు నాయక్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
బ్రేకింగ్ న్యూస్

డాక్టర్ నేనావత్ రాములు నాయక్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

చందంపేట మండలం: పేదోడి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ నేనావత్ రాములు నాయక్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్,

09:10 ఉదయం AM

గన్నేర్లపల్లిలో ఘనంగా డాక్టర్ రాములు నాయక్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం

చందంపేట మండలం: పేదోడి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ నేనావత్ రాములు నాయక్ ప్రథమ వర్ధంతి సందర్భంగా చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ నేనావత్ రాములు నాయక్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ రాములు నాయక్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పేదోడి డాక్టర్‌గా ఎంతో మంది నిరుపేదలకు వైద్య సేవలు అందించి, వారి జీవితాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.

డాక్టర్ రాములు నాయక్ నేడు మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన వైద్య సేవలు, ప్రజల కోసం చేసిన కృషి, ఆయన జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, లోక్య నాయక్, వడ్త్య దేవేందర్ నాయక్, కేతావత్ హరిలాల్, వడ్త్య బాలు నాయక్, సర్పంచ్‌లు నేనావత్ భరత్, తులసీరాం, కౌన్సిలర్ అజయ్ చంద్ర, మాజీ కౌన్సిలర్ జయప్రకాశ్, నేనావత్ జైపాల్ నాయక్, నేనావత్ నాగార్జున నాయక్, కిషన్ నాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 39🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *