Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్
Home › బ్రేకింగ్ న్యూస్ › ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్
బ్రేకింగ్ న్యూస్

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్

డిండి, అక్టోబర్ 30: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం డిండి

01:26 మధ్యాహ్నం PM

డిండి, అక్టోబర్ 30:
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం డిండి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
డిండి మండలం పెద్ద తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించి, ఓపెన్ ఎయిర్ జిమ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం చెర్కుపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. రైతు వేదిక సమీపంలో యువత, గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలతో పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన రహదారులు, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
పలువురు నాయకులు, అధికారులు హాజరు
ఈ కార్యక్రమాల్లో సంబంధిత ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దొంతినేని వెంకటేశ్వరరావు, ముత్యాల శశిధర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, చింతలపూడి భాస్కర్ రెడ్డి, తూమ్ నాగార్జున రెడ్డి, కాట్రావత్ చిట్టి శంకర్, మీసాల రామచంద్రయ్య, మండల సర్పంచులు, గడ్డమీది సాయి కుమార్, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
272 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App