Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తాజా వార్తలు › బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
తాజా వార్తలు

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

01:00 మధ్యాహ్నం PM

రేగడి మద్దికుంటలో అక్షితరాణి కుటుంబానికి పరామర్శ

రూ.4.12 లక్షల ఆర్థిక సహాయం మంజూరు పత్రం అందజేత

ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు: ప్రభుత్వ విప్ విజయరమణ రావు

సుల్తానాబాద్, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితరాణి మృతి నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పరామర్శించారు.

అక్షితరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.4,12,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టప్రకారం విచారణ జరిపి, నేరం రుజువైతే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మహిళలు, పేదలు, దళితులపై వేధింపులు, హింస పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించే దిశగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు హామీ ఇచ్చారు.

మహిళలపై వేధింపులు, హింసకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 14🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App