Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › బోయినపేట విద్యుత్ సమస్యలు పరిష్కరించకుంటే కార్యాలయం ముట్టడి
బ్రేకింగ్ న్యూస్

బోయినపేట విద్యుత్ సమస్యలు పరిష్కరించకుంటే కార్యాలయం ముట్టడి

11:38 ఉదయం AM

నిరాహార దీక్షకు సిద్ధం: 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి

మంథని, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): మంథని మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బోయినపేటలో నెలకొన్న విద్యుత్ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలను తొలగించి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉందన్నారు.

చీకట్లో బోయినపేట వాసుల ఇబ్బందులు

బోయినపేటలోని పలు వాడల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు చిమ్మచీకటిలో రాకపోకలు సాగించాల్సి వస్తోందని శ్రీలతక్రాంతి తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళ బయటకు రావడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. చీకటి కారణంగా విషపూరిత పాములు, ఇతర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొన్ని ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయని, మరికొన్ని చోట్ల పాత ఇనుప స్తంభాలు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. వర్షాలు, ఈదురుగాలులు, గాలిదుమారాల సమయంలో బలహీనంగా ఉన్న స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాత కట్టపై వెలుగులు ఏర్పాటు చేయాలి

బోయినపేటకు వెళ్లే ప్రధాన మార్గమైన పాత కట్టపై విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రివేళ రహదారి మొత్తం చీకటిగా మారుతోందని తెలిపారు. ఈ మార్గంలో నిత్యం ప్రజలు, వాహనదారులు ప్రయాణిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని కోరారు.

బోయినపేటలో విద్యుత్ సమస్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని శ్రీలతక్రాంతి ఆరోపించారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన

ఇకనైనా అధికారులు బోయినపేటలోని అన్ని వాడలను క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యుత్ స్తంభాలు, తీగలు, వీధి దీపాలు, మీటర్ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సమస్యల పరిష్కారంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి స్పష్టం చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 39🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *