ఆందోళనలు, పోరాటాల ఫలితంగానే పునరుద్ధరణ జరిగిందని బీఆర్ఎస్ నాయకుల వెల్లడి
మహాదేవపూర్ | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
మహాదేవపూర్ మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న HP గ్యాస్ ఏజెన్సీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ సేవలను ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు, పోరాటాల నేపథ్యంలో ఏజెన్సీ సేవలు పునరుద్ధరించబడినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీ సేవల పునరుద్ధరణ కోసం ఆందోళనలు నిర్వహించినట్లు నాయకులు పేర్కొన్నారు. తమ పార్టీ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే ఏజెన్సీ సేవలు తిరిగి యథావిధిగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
గ్యాస్ ఏజెన్సీ సేవలు పునరుద్ధరించడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులోనూ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ పోరాటానికి సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, మాజీ సర్పంచ్ శ్రీపతిబాపు, కేదారి గీత, అలీం ఖాన్, చిల్ల కుమార్, వెన్నంపల్లి మహేష్, కడార్ల రాజబాపు, తోట మనోజ్, కడారి రమేష్, కావేరి దుర్గయ్య, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply