రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అభినయ్ రాజు కుటుంబ సభ్యులకు ఓదార్పు
దేవరకొండ, సెప్టెంబర్ 15 (అయుష్ 24 న్యూస్):
దేవరకొండ పట్టణానికి చెందిన గాజుల రాజేష్ కుమారుడు గాజుల అభినయ్ రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ మంగళవారం గాజుల రాజేష్, గాజుల ఆంజనేయులు నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని అన్నారు. అభినయ్ రాజు ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అభినయ్ రాజు జ్ఞాపకాలను స్మరించుకుంటూ మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.

జగదీశ్ రెడ్డి, రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో రాజేష్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారికి నాయకులు ఓదార్పునిస్తూ మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గాజుల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రామచంద్రనాయక్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, బిల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply