ఫైర్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, కేజీబీవీ అదనపు బ్లాక్, పీహెచ్సీ ప్రారంభోత్సవాలు — పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అక్టోబర్ 3న మహాదేవపూర్, పలిమెల మండలాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
మహాదేవపూర్‌లో ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కార్యాలయం (ఫైర్ స్టేషన్)ను ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు రూ.65 లక్షలతో నిర్మించిన నూతన తహసీల్దార్ (ఎంఆర్ఓ) కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం పలిమెల మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు పంకెనలో రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన అదనపు బ్లాక్‌ను ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన సబ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం పలిమెలలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు సీఆర్ఆర్ నిధుల నుంచి రూ.3 కోట్లతో మంజూరైన పలిమెల నుంచి గోదావరి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు రూ.1.93 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను ప్రారంభించనున్నారు. అదే సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన మహిళా సమైక్యల వీవో భవనాలకు సంబంధించి రూ.80 లక్షలతో పలిమెల, నీలంపల్లి, లెంకలగడ్డ, పంకెన, దమ్మూరు, సర్వాయిపేట, మూదేడు, ముకునూరు గ్రామాల్లో చేపట్టనున్న భవన నిర్మాణ పనులకు పలిమెలలో శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పీఏ ఏ. చంద్రశేఖర్ వెల్లడించిన పర్యటన వివరాల ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.










Leave a Reply