ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లి రోడ్డు మంజూరుకు కృషి చేస్తామని హామీ
ఇల్లందు: సెప్టెంబర్ 29 (AYUSH24 News ప్రతినిధి)
బర్లగూడెం గ్రామం నుంచి జంగాలపల్లి గ్రామానికి వెళ్లే రహదారి సమస్యను ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ గ్రామస్థులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రహదారి కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సమస్యను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లి, రహదారి మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని కోరం సురేందర్ హామీ ఇచ్చారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply