హైదరాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశం
జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపు
హైదరాబాద్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): ల్యాబ్ టెక్నీషియన్లు ఒకే వేదికపై ఐక్యంగా ముందుకు వస్తేనే అసోసియేషన్ మరింత బలోపేతమవుతుందని రాష్ట్ర అధ్యక్షుడు పి. వీరయ్య అన్నారు. హైదరాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో అసోసియేషన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న చిన్న, పెద్ద సమస్యలను త్వరగా పరిష్కరించుకునేందుకు ఐక్యత అవసరమని పేర్కొన్నారు. టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత స్థానిక వైద్య అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర రవీందర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయాలని జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్‌కు సూచించారు.
రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దాసరపు చిరంజీవి బీ2బీ ప్రైస్ లిస్టులు, సర్వీస్ విధానాలకు సంబంధించిన అంశాలను సమావేశంలో ప్రస్తావించి, వాటిపై రాష్ట్ర కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని ల్యాబ్ యజమానులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా అందిస్తున్న టెస్టింగ్ సర్వీసుల విషయంలో ఎదురవుతున్న సమస్యలపై సమిష్టిగా స్పందించాలని కోరారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నాగోల్ లయన్ క్లబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత సంతోష్ కుమార్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చైతన్యపురి–దిల్సుఖ్నగర్ ఎస్.ఎం. డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత షాహిద్ ఖాన్‌ను ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జ్ టి. మధువన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అసోసియేషన్ నిర్వహించే సమావేశాలకు సభ్యులు హాజరై సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు పలువురు స్థానిక ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply