మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానం
మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌కు మంథని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల గణిత ఉపాధ్యాయుడు భరత్‌రెడ్డి ఎంపికయ్యారు. వియత్నాం విద్యా పర్యటనకు ఎంపికైన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యారంగంలో విశేషంగా కృషి చేస్తూ వియత్నాం విద్యా పర్యటనకు భరత్‌రెడ్డి ఎంపిక కావడం మంథని ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. ఈ విద్యా పర్యటన ద్వారా నూతన విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచిడి రాజు గౌడ్, మద్దికట్ల స్రవంతి, పోతరబోయిన శ్రీలత, జంబోజు శ్రీమతి, లైశెట్టి రజిత, మారుపాక నిహారిక, పెంటరి రాజు, వేముల లక్ష్మి, యేల్లంకి వంశీధర్ పాల్గొన్నారు.










Leave a Reply